ఉద్యోగ వారధిగా గూగుల్
గూగుల్ ఏ చిన్న విషయాన్నైనా క్షణాల్లో మనముందుంచే ఇంటర్నెట్ ఆయుధం. మనిషికి తెలిసిన దాదాపు అన్ని విషయాలూ గూగుల్ అమ్ముల పొదిలో భద్రంగా ఉంటాయి. అందుకే దాన్ని గూగుల్ తల్లి అని సంభోదిస్తున్నారు కొందరు. అందుకేనేమో ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న నిరుద్యోగాన్ని తగ్గించేందుకు తనవంతు కృషిగా మనముందుకు వచ్చేస్తోంది. ఉద్యోగం కోసం వెతికే వారి కోసం అవసరమైన సమాచారాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటి దాకా ఉద్యోగం కోసం వెతికే వారికి ఉద్యోగ సైట్లను మాత్రమే సూచించేది. కానీ ఇక ముందు ఉద్యోగ వివరాలు, అనువైన ఉద్యోగం, నైపుణ్యం, కంపెనీల రేటింగ్స్, తదితర సమాచారంతో ఉద్యోగ వారధిగా మారడానికి సిద్ధమైంది. దీనికోసం లింక్డ్ఇన్, మాన్స్టర్, వేఅప్, డైరెక్ట్ఎంప్లాయర్స్, కెరీర్‌బిల్డర్, గ్లాస్‌డోర్, ఫేస్‌బుక్‌లతో బృందంగా ఏర్పాటు కాబోతోంది.













