దృష్టిలోపానికి జన్యు చికిత్స
పిల్లల్లో వారసత్వంగా వచ్చే దృష్టిలోపాన్ని నివారించేందుకు అమెరికాలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త సూక్ష్మ అణువులను అభివృద్ధి చేశారు. అవి కణాలను లక్ష్యంగా చేసుకుని జన్యువును పంపిణీ చేసి దృష్టిలోపాన్ని నివారిస్తాయి. తాము రూపొందించిన కొత్త సాంకేతికత ఎలాంటి దృశ్య రుగ్మతలనైనా తగ్గిస్తుందని విశ్వసిస్తున్నామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ సూక్ష్మ అణువులు నేత్రపటల వర్ణక ఉపకళ కణాలకు (ఆర్పీఈ) ఆరోగ్యకరమైన ఆర్మీఈ65 కొవ్వు ఆధారిత జన్యువును అందిస్తాయని వివరించారు.








