భారత్ కు అనుకూలం… పాక్ కు చురకలు
భారత్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనేని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన రియాద్‌లోని అరబ్ ఇస్లామిక్- యుఎస్ సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి భారత్ వరకు, ఆస్ట్రేలియా నుంచి రష్యా వరకు అన్ని దేశాలు ఉగ్రవాద బాధితులేనని ఆయన అన్నారు. ఈ దేశాలన్నీ పలు సార్లు ఉగ్ర దాడుల బారిన పడ్డాయని తెలిపారు. ఏ దేశం కూడా తమ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి ట్రంప్ అన్నారు.








