అల్లాడుతున్న తెలుగు కుటుంబాలు
ఇర్మా హరికేన్ ధాటికి వేల సంఖ్యలో తెలుగు కుటుంబాలు అల్లాడుతున్నాయి. ఒక్క ఫ్లోరిడాలోనే దాదాపు ఆరు వేల వరకు తెలుగు కుటుంబాలున్నాయి. తీర ప్రాంతాల్లో ఇర్మా ప్రభావం తీవ్రంగా ఉండటంతో అక్కడి అధికారులు ప్రజలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో నిరాశ్రయు లైన తెలుగు ప్రజలకు ఇతర రాష్ట్రాలు, నగరాల్లోని తెలుగువారు బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఫ్లోరిడా నుంచి దాదాపు వెయ్యి తెలుగు కుటుం బాలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది.








