ట్రంప్ వద్దకు వచ్చేస్తున్న మెలానియా!
అమెరికా అధ్యక్షుడి గా ఎన్నికైన నాటి నుంచి వైట్ హౌస్‌లో ఆడ తోడు లేకుండా ఉంటున్న డొనాల్డ్ ట్రంప్ ఇకపై తన జీవిత భాగస్వామితో కలసి ఉండనున్నారు. ఇన్ని రోజులూ కొడుకు చదువు పేరిట భర్తకు దూరం గా ఉన్న ఒకప్పటి అందాల మోడల్, నేటి యుఎస్ ఫస్ట్ లేడీ మెలానియా శ్వేత సౌధానికి రానున్నారు. న్యూయార్క్ లోని ట్రంప్ టవర్స్‌లో ఉంటున్న మెలానియా కొడుకు చదువు పూర్తి కావడంతో వైట్ హౌస్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలి ట్రంప్ విదేశీ టూర్లలో మెలానియా వైఖరి వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు అనుమానాలను రేకెత్తించిన సంగతి తెలిసిందే. సౌదీలో, రోమ్‌లో ట్రంప్ చెయ్యి అందించినా, దాన్ని అందుకోకుండా అంటీ ముట్టనట్టు మెలానియా వ్యవహరించడంతో, అమెరికన్లు సైతం అవాక్కయ్యారు. ఇక తమ మధ్య విభేదాలు లేవని చెప్పేందుకు ఈ నెల 14న ట్రంప్ పుట్టిన రోజు నాటికి ఆమె వైట్ హౌస్‌కు వచ్చేస్తారని, తద్వారా తమ బంధంపై నెలకొన్న అనుమానాలను ఆమె తీరుస్తారని సమాచారం.













