డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హవాయి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. హవాయిలోని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ట్రంప్ ట్రావెల్ బ్యాన్పై నిషేధాన్ని కొనసాగించాలని తీర్చునిచ్చారు. ఈ మేరకు న్యాయమూర్తి డెర్రిక్ వాట్సన్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్ ఆరు ముస్లిం దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదం, విదేశీ, విద్యార్థులు, విదేశీయులను ఉద్యోగాల్లో చేర్చుకోవడాన్ని ఈ నిషేధం కట్టడి చేస్తుందని అమెరికా ప్రభుత్వం కోర్టులో వాదించింది. హవాయి రాష్ట్ర ప్రభుత్వం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తన తీర్పును వెలువరించారు. దీంతో గతంలో విధించిన ట్రావెల్ బ్యాన్ రద్దు మరికొంత కాలం కొనసాగనుంది.







