ట్రంప్ గురించి ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఏమన్నారో తెలుసా?
కారణం ఉన్నా లేకున్నా అధ్యక్షుడు ఓ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ను తొలగిస్తారు. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు అని ఇటీవల పదవి కోల్పోయిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కొమె తన సహచరులకు తెలిపారు. ఆయన వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ నేను ఇక ఈ పదవిలో కొనసాగటంలేదు. ఏదైనా మంచికే. కానీ నేను మిమ్మల్ని మిస్ అవుతున్నా. నేను గతంలో కూడా చెప్పాను అమెరికా ప్రజలు కష్టకాలంలో మన వైపే చూస్తారు. మనలోని నిజాయితీ, స్వతంత్రత, పట్టుదలలే దీనికి కారణం. అమెరికాను పటిష్టంగా మార్చడానికి మనం కృషి చేస్తున్నాం. నిబద్ధులైన మీలాంటి వారి సాంగత్యాన్ని వీడడం నాకు బాధగానే ఉంది. మన విలువలను సజీవంగా ఉంచేందుకు మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
అమెరికాను రక్షించే మహోన్నత కార్యానికి కంకణ బద్ధులై ఉంటారని భావిస్తున్నాను. మీరు ఆ కర్తవ్యాన్ని నిర్వరిస్తే, ఇక్కడ నుంచి వీడేటప్పుడు బాధగా ఉంటుంది. కానీ అమెరికా భద్రంగా ఉంటుంది. మీతో కలిసి పనిచేయడం నా జీవితంలో అత్యంత గొప్ప విషయం, మీరిచ్చిన బహుమతికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ వాడకంపై జరుగుతున్న విచారణను కామీ సరిగా హ్యాండిల్ చేయలేదన్న కారణంతో ఆయనను ట్రంప్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే.








