ట్రంప్ ఆరోపణలకు జుకర్ బర్గ్ ఖండన
ఫేస్‌బుక్‌ను ట్రంప్ వ్యతిరేకి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించడంపై ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, సిఇఓ మార్క్ జుకర్‌బెర్గ్ ఎదురు దాడి చేశారు. అన్ని ఆలోచనలు, భావాలకు ఫేస్బుక్ ఒక వేదికగా వుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ చేసిన ట్వీట్లపై స్పందిస్తూ, అమెరికా ఎన్నికల్లో ఫేస్బుక్ తటస్థంగా వున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలను ఒక తాటిపైకి తీసుకురావడానికే తాను పని చేస్తానని, అన్ని వర్గాల ప్రజలు తమ వాణిని వినిపించేందుకు, వారి ఆలోచనలు, భావాలు పంచుకునేందుకే ఈ వేదిక ఏర్పాటు చేసామని జుకర్‌బెర్గ్ చెప్పారు.













