ఫేస్బుక్ గూటికి టాప్ ఎగ్జిక్యూటివ్
ఉబెర్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఫేస్ బుక్ గూటికి చేరారు. ఉబెర్ మాజీ పీఆర్ చీఫ్ రాచెల్ వెట్స్టోన్ను ఫేస్బుక్ ఉపాధ్యక్షులుగా నియమించుకుంది. ది గార్డియన్ అందించిన నివేదిక ప్రకారం ఉబెర్లో మాజీ ఉన్నత ప్రజా సంబంధాల అధికారిగా ఉన్న రాచెల్ను సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్, వాట్స్ అప్, మెసెంబర్కు కమ్యూనికేషన్ల వైస్ ప్రెసిడెంట్గా చేరినట్లు ఫేస్బుక్ ప్రకటించింది. ఫేస్బుక్ ఫ్యామిలీలో చేరడం తనకు గౌరవమని వెట్స్టోన్ సంతోషం వ్యక్తం చేశార. తన సొంత కుటుంబం, స్నేహితులతో సన్నిహితంగా ఉండటం సులభమైందని తద్వారా వాట్సాప్ తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందనీ ఒక ప్రకటనలో తెలిపారు.








