టాప్ 10లో ఫేస్బుక్ స్థానం
బ్రాండ్ విలువలో అత్యంత ప్రాచుర్యం పొందిన టాప్ 100 కంపెనీల జాబితాను ఇంటర్ బ్రాండ్ కంపెనీ విడుదల చేసింది. కాగా ఈ జాబితాలో మొదటి పది స్థానాల్లో టెక్నాలజీ కంపెనీలే ఉన్నాయి. ఈ జాబితాలో ఆపిల్, గూగుల్ సంస్థలు వరుసగా అయిదవసారి మొదటి, రెండవ స్థానాల్లో నిలిచాయి. ఆపిల్ బ్రాండ్ విలువ 184.1 బిలియన్లుగా, గూగుల్ బ్రాండ్ విలువ 141.7 బిలియన్లుగా ఇంటర్ బ్రాండ్ నివేదికలో పేర్కొంది. ఇక మూడవ స్థానంలో మైక్రోసాఫ్ట్ నిలిచింది. దీని బ్రాండ్ విలువ 79.9 బిలియన్ డాలర్లు. ఇంకా ఈ జాబితాలో అమెజాన్, శాంసంగ్, టయోటా, ఫేస్బుక్, మెర్సిడెజ్ బెంజ్, ఐబిఎం కంపెనీలు నిలిచాయి. టాప్ 10లో ఫేస్బుక్ స్థానం సంపాదించడం ఇదే మొదటిసారి. ఫేస్బుక్, అమేజాన్, ఆడిడాన్, స్టార్బక్స్ కంపెనీల బ్రాండ్ విలువ గత సంవత్సరంతో పోల్చితే గరిష్టంగా పెరిగిందని నివేదిక తెలిపింది.













