విశాఖ యువకుడికి ఫేస్బుక్ పిలుపు
వ్యాపార సంస్థల్లో డేటా మేనేజ్మెంట్ మరింత సులభమయ్యేలా సరికొత్త బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ ఆవిష్కృతమైంది. విశాఖకు చెందిన కేవీ రామ్హర్ష ఈ ఏడాదే రాజాంలోని జీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. డేటా మేనేజ్మెంట్ సొల్యూషన్ ప్రోగ్రామ్ను అభివృద్ధిపరచి ఇమూక్స్ అని పేరు పెట్టాడు. ప్రస్తుత మార్కెట్లో ఉన్న ఈ తరహా వ్యాపార ఉత్పత్తులకు ఇమూక్స్ భిన్నమైందని దీనిని అందరూ ఉపయోగించుకోవచ్చని చెప్పాడు. ఇమూక్స్ను పరిశీలించిన ఫేస్బుక్ సంస్థ రామ్హర్షను కాలిఫోర్నియాలోని తమ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించింది. ఈ టూల్ పనిచేసే విధానాన్ని ప్రదర్శించి, ప్రయోజనాలను వివరించాలని కోరింది. ఈ నెల 17న రామ్ హర్ష కాలిఫోర్నియా వెళుతున్నాడు. తమ కళాశాల విద్యార్థి రామ్హర్ష ఇమూక్స్ను రూపొందించడం, అమెరికా వెళుతుండడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.













