బేటన్ రూజ్ నగరంలో అగ్ని ప్రమాదం…
లూసియానా రాష్ట్రం లోని బేటన్ రూజ్ నగరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థులు నివసిస్తోన్న అనేక అపార్ట్మెంట్లు నేలమట్టమయ్యాయి. సుమారు పదకొండుమంది తెలుగు విద్యార్థులు తమ సర్వస్వమూ కోల్పోయారు. పర్సులు, పాస్ పోర్ట్‌లతో సహా అగ్నికి ఆహుతయ్యాయి. వారు కట్టుబట్టలతో, ప్రాణాలతో బయట పడ్డారు.








