పిల్లల ఎదుగుదలకు రోజుకో గుడ్డు!
చంటిపిల్లలకు రోజుకో గుడ్డును తినిపిస్తే వారి ఎదుగుదల 47శాతం గణనీయంగా పెరుగుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. చిన్నారులు సులభంగా తినేందుకు వీలుగా గుడ్లు అందుబాటులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎదుగుదల మందగించిన చిన్నారుల్లో తిరిగి ఎదుగుదల అభివృద్ధి చెందడంలో పోషకాలు సమృద్ధిగా ఉండే గుడ్లు ఎంతోగాను తోడ్పతాయని పరిశోధనలో రుజువైందని వాషింగ్టన్ యూనివర్సిటీ రచయిత లోరా లన్నొట్టి వెల్లడించారు. ఈ పరిశోధనకు సంబంధించి జనరల్ పీడియాట్రిక్స్‌లో కథనం ప్రచురితమైంది. పరిశోధన ప్రకారం ఎవరైతే రోజుకో గుడ్డును తింటారో వారిలో ఎదుగుల లోపాన్ని 47శాతం తగ్గించి పెరుగుదలకు దోహదపడటమే కాకుండా, బరువును 74శాతం వరకు అదుపులో ఉంచుతుందని పేర్కొంది. ఈ పరిశోధన ఇంత అద్భుతంగా పని చేస్తుందనిన రుజువుకావడంతో తమనెంతో ఆశ్చర్యానికి గురిచేసిందని లన్నొట్టి తెలిపారు.
ప్రపంచ సగటులో 0.39తో పోలిస్తే 0.63 ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన అన్నారు. పరిశోధనలో భాగంగా బృందం ఆరు నుంచి తొమ్మిది నెలల చిన్నారులకు ఆరు నెలల పాటు రోజుకో గుడ్డు తినిపించాలి. మరో గ్రూపు చిన్నారులకు గుడ్లు లేకుండా ఆహారాన్ని ఇచ్చారు. ఇతర ఆహార పదార్థాలు, ప్రత్యేక బలవర్థకమైన ఆహారం తీసుకున్న చిన్నారుల కంటే గుడ్లు మాత్రమే ఆహారంగా ఇచ్చిన చిన్నారుల్లో ఎదుగుదలో మార్పులు కనిపించినట్టు పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్నారుల పోషక ఆహారం విషయంలో గుడ్లను వినియోగించేలా చూడాలని లన్నొట్టి తెలిపారు.













