కేన్సర్ తీవ్రతను తగ్గించే బాదం జీడి పప్పు
బాదం, జీడిపప్పు, అక్రూట్ (వాల్నట్), హేజిల్ నట్, పెకాన్ నట్ లాంటి గింజలు వారానికి 50 గ్రాములపైన తింటే పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నవాళ్లకు మరణం ముప్పు 57శాతం తగ్గొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం 42శాతం తగ్గుతుందని పేర్కొంటున్నారు. పెద్దపేగు క్యాన్సర్ మూడో దశలో ఉన్న 826 మంది రోగులపై తాము జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని అమెరికాలోని బోస్టన్లో ఉన్న డనాఫార్బర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. క్యాన్సర్ నివారణలో ఆహారపు అలవాట్ల పాత్రపై గతంలో అనేక అధ్యయనాలు దృష్టి సారించాయన్నారు. పెద్దపేగు క్యాన్సర్ విషయంలో తమది కొత్త తరహా అధ్యయనమని చెప్పారు.













