2020లో అధ్యక్ష బరిలో హాలీవుడ్ నటుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే తానే బాగా పనిచేస్తానని అంటున్నాడు ప్రముఖ హాలీవుడ్ నటుడు, మాజీ రెజ్లర్ డ్వెయిన్ జాన్సన్ (ద రాక్). అంతేకాదు 2020లో అమెరికా అధ్యక్ష బరిలో దిగుతానంటున్నాడు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఉండడం అంటే మామలు విషయం కాదని ఇది తనకు సాధ్యమయ్యే విషయమేనని చెప్తున్నాడు. 2016 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను ట్రంప్‌కి కానీ హిల్లరీకి కానీ ఓటెయ్యలేదు. నేను కానీ అధ్యక్షుడినై ఉంటే ఓ నాయకుడిగా ప్రజల పట్ల బాధ్యతగా ఉంటాను. నేను వ్యతిరేకించేవారి పట్ల కూడా తప్పుగా ప్రవర్తించను. వాళ్లని కూడా నాతో కలుపుకుంటాను. చెప్పాలంటే ఓ అధ్యక్షుడిగా ట్రంప్ కంటే నేనే బాగా పనిచేస్తాను అని చెప్పుకొచ్చాడు.













