డిటిఎ క్రికెట్ పోటీల్లో విజేత ఫార్మింగ్టన్ క్రికెట్ క్లబ్
డిట్రాయిట్ తెలుగు సంఘం (డీటీఏ) 40వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిచిన క్రికెట్ పోటీలకు విశేష స్పందనన లభించిందని వేడుకల సమన్వయకర్త మారెంరెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో ఫార్మింగ్టన్ క్రికెట్ క్లబ్ విజేతగా నిలిచింది. టీం స్టార్స్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేత జట్టుకు 4 వేల డాలర్లు, రెండో స్థానం సాధించిన జట్టుకు 2 వేల డాలర్లు బహుమతిగా అందించారు. క్రికెట్ పోటీల విజయవంతానికి తోడ్పడిన క్రీడా కమిటీ అధ్యక్షుడు దొప్పలపూడి రవి, బచ్చు సుధీర్ తదితరులను ఆయన అభినందించారు.













