డాక్టర్ రెడ్డీస్ మరో కొత్త ఔషధం విడుదల
హాని కలిగించే కొవ్వు తగ్గించడానికి వినియోగించే జనరిక్ ఎజ్టిమైబ్ సిమ్వాస్టాటిన్ బిళ్లలను అమెరికా విపణిలోకి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ విడుదల చేసింది. ఈ జనరిక్ ఔషధానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి అనుమతి పొందామని తెలిపింది. ఎంఎస్డీ ఇంటర్నేషనల్ జీఎంబీహెచ్ వైటోరిస్ బ్రాండ్‌తో ఎజ్టిమైబ్ అండ్ సిమ్స్టాటిన్ బిళ్లలను అమెరికా మార్కెట్లో విక్రయిస్తోంది. డాక్టర్ రెడ్డీస్ ప్రవేశపెట్టిన జనరిక్ చికిత్స పరంగా దీనికి సమానమైంది. వైటోరిన్కు జనరిక్‌ను విడుదల చేయడానికి అనుమతి పొందిన తొలి కంపెనీ ఇదే. 2017, ఫిబ్రవరితో ముగిసిన ఏడాదికి అమెరికాలో వైటోరిన్ విక్రయాలు 67.8 కోట్ల డాలర్లు ఉన్నాయి.













