డా. నల్లూరి ప్రసాద్‌కు పితృవియోగం
ప్రముఖ ప్రవాస తెలుగు వైద్యులు, పారిశ్రామికవేత్త డా.నల్లూరి ప్రసాద్ తండ్రి డా.నల్లూరు సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. టి.నరసాపురం నుండి చింతలపూడి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మోటర్‌సైకిల్ డీకొట్టడంతో ఆయనకు తీవ్రగాయలయ్యాయి. సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన్ను వైద్యులు కాపాడలేకపోయారు. సత్యనారాయణ టీ.నరసాపురంలో హోమియో వైద్యులుగా ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు ఎన్నారైలు సంతాపం వ్యక్తం చేశారు.








