అమెరికా అధ్యక్షుడు సూపర్కారు వేలం
ఫెరారీ ఎఫ్430 అనే ఈ ఎఫ్-1 సూపర్ కారుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు యజమాని. ప్లోరిడాలో వేలం వేయగా రూ.1.75 కోట్లు పలికింది. ఎవరు కొనుక్కున్నారనే వివరాలను తెలపడానికి వేలం నిర్వహించిన సంస్థ అంగీకరించలేదు. 2007లో ఈ కారును కొన్న ట్రంప్ నాలుగేళ్లపాటు దీన్ని వాడారు. 3,860 కిమీ తిరిగారు. అనంతరం దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి 5,800 కిమీ నడిపారు. తాజాగా వేలం నిర్వహించారు. మార్కెట్లో ఈ కొత్త కారు ధర రూ.1.20 కోట్ల నుంచి రూ.1.40 కోట్లు పలుకుతోంది. ఇప్పటికే ట్రంపే దీని యజమాని అయి ఉంటే ఎక్కువ ధర పలికి ఉండేదని వేలం నిర్వహించిన సంస్థ చెబుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్కు చెందిన కౌబాయ్ బూట్లు గత ఏడాది రూ.1.30 కోట్లు పలికాయి మరి.













