విద్వేష దాడులపై ట్రంప్ ప్రభుత్వ దృష్టి
అమెరికా ప్రభుత్వం ఇటీవల దేశంలో పెరుగుతున్న జాతి విద్వేష దాడులపై దృష్టి పెట్టింది. ఈ ఘటనలను అధ్యయనం చేసి, ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. హిందువులు, సిక్కులపై జరిగిన దాడులను కూడా టాస్క్‌ఫోర్స్ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకుంటారు. జాతి విద్వేష నేరాలపై ప్రత్యేక దృష్టి సారించిన అటార్నీ జనరల్ జూన్ 29న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కాగా, న్యూయార్క్‌లో 48 ఏళ్ల సంపన్న వ్యక్తి 30 ఏల్ల ఆసియన్ యువకుడిపై జాతి విద్వేషదాడికి పాల్పడాడు. నిందితుణ్ణి అరెస్టు చేసి బెయిలుపై విడుదల చేశారు. కాగా, సిరియా, ఉత్తర కొరియాల్లో పరిస్థితిని చక్కదిద్దే అంశంపై అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్ ఫోన్లో మాట్లాడుకున్నారు.








