అమెరికా అధ్యక్షుడు గ్రహణాన్ని ఇలా చూశారట
గ్రహణ సమయంలోనూ ట్రంప్ తనదైన చమక్కులు చూపించారు. నిన్నటి సూర్యగ్రహణంపై అమెరికావాసులంతా భయపడుతుంటే, అధ్యక్షుడు ట్రంప్ నేరుగా గ్రహణాన్ని చూసి ప్రజలకు షాకిచ్చారు. దాదాపు 20 కోట్ల మంది ప్రత్యేక పరికరాలతో చూసిన ఈ గ్రహణాన్ని ట్రంప్ నేరుగా తనదైన స్టయిల్లో చూశారు. గ్రహణం సమయంలో వైట్‌హౌస్ బాల్కనీలో నిలుచుని ట్రంప్, అతని భార్య మెలానియా గ్రహణాన్ని వీక్షించారు. ఈ సమయంలో ట్రంప్ చిత్రవిచిత్రంగా తన కళ్లు మూస్తూ తెరుస్తూ గ్రహణాన్ని వీక్షించారు.








