పాక్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే సహించబోమని హెచ్చరించారు. ఉగ్ర సంస్థలకు పాక్ స్వర్గధామంగా ఉండటంపై తాము చూస్తూ ఊరుకోబోమని సృష్టం చేశారు. ఆప్ఘన్ అమెరికన్ ఆపరేషన్‌లో భాగస్వామిగా పాక్ ఎంతో లాభపడిందని, అయితే నేరస్తులు, క్రిమినల్స్‌కు ఆశ్రయం కల్పించడం ద్వారా ఆ దేశం దెబ్బతింటుందని సృష్టం చేశారు. ఉగ్రవాదులపై కఠినవైఖరి అవలంభించని పక్షంలో పాక్‌కూ అమెరికా అందించే సైనిక, ఇతర సాయాలు నిలిచిపోతాయని హెచ్చరించారు.








