వారికి అంతర్జాలం ఆపేయండి
ఉగ్రవాదులకు, వారికి సహకరిస్తున్న సంస్థలకు తక్షణం ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లండన్ ఉగ్రదాడిపై ఆయన స్పందిస్తూ ఇలాంటి దృశ్చర్యలకు పాల్పడే వారికి ఏ మాత్రం క్షమించకూడదని అన్నారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అనేది హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.








