ఎట్టిపరిస్థితుల్లోనూ గోడ కట్టి తీరుతాం … ట్రంప్
అమెరికా -మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టితీరుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సృష్టం చేశారు. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరికైనా సందేహాలుంటే తీర్చుకోవాలని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గోడ కట్టితీరుతామని కుండబద్దలు కొట్టారు. దీని నిర్మాణం ద్వారా మత్తుపదార్థాలు, మనుషుల అక్రమ రవాణాను నిరోధించవచ్చని చెప్పారు. వాస్తవానికి ఇవి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలని కానీ వీటిపై ఎవరూ మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. దాదాపు 3,100 కిలోమీటర్ల గల అమెరికా-మెక్సికో సరిహద్దులో 1600 కిలోమీటర్ల పరిధిలో ఈ గోడ నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల తనని కలిసిన రక్షణ కార్యదర్శి జాన్ కెల్లీ సైతం కచ్చితంగా ఓ గోడను నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారని ట్రంప్ వెల్లడించారు. అయితే కొందరు దీనికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నారో తనకు తెలియదని, వందశాతం గోడ కట్టితీరుతామని ఆయన సృష్టం చేశారు.













