ఆరోగ్య సంరక్షణ బిల్లులో డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సెనెట్‌లో ఎదురు దెబ్బ తగిలింది. ఒబామా కేర్ స్థానంలో తీసుకురాదలచిన కొత్త ఆరోగ్య సంరక్షణ బిల్లును సెనెట్‌లో ప్రవేశపెట్టటంలో విఫలమయ్యారు. తన ఎన్నికల వాగ్దానాల్లో ఒకటైన ఆరోగ్య సంరక్షణ బిల్లును సాకారం చేయాలన్న ట్రంప్ యత్నం బెడిచికొట్టింది. డెమొక్రాట్లు, తన సొంత పార్టీకి చెందిన కొందరు రిపబ్లికన్ సెనెటర్లే దీనికి కారణమని నిందిస్తూ ట్రంప్ వరుసగా ట్వీట్లు చేశారు. వంద మంది సభ్యులున్న సెనెట్‌లో బిల్లు ఆమోదం పొందాలంటే సాధారణ మెజారిటీ 51 కాకుండా 60 శాతం ఓట్లు తప్పనిసరిగా రావాలన్న ఫిలిబస్టర్ నిబంధననూ తొలగించాలని ట్రంప్ కోరుతున్నారు. ఒబామాకేర్లో కొన్ని నిబంధనలను మార్చటానికి సైతం 60 మంది మద్దతు అవసరం కావటంపై ట్రంప్ మండిపడుతున్నారు.













