రష్యాపై ఆంక్షల అమలుకు డొనాల్డ్ ఒకే
రష్యాపై ఆంక్షలు విధిస్తూ కాంగ్రెస్, సెనేట్ ఆమోదించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. గత ఏడాది జరిగిన తమ దేశాధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నదన్న ఆరోపణలతోపాటు ఉక్రెయిన్‌లోని క్రెమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించిన నేపథ్యంలో రష్యాపై అమెరికా కఠినమైన ఆంక్షలు విధించినట్లు తెలుస్తున్నది. మీడియాకు దూరంగా అత్యంత రహస్వంగా బిల్లుపై ట్రంప్ సంతకం చేశారని వైట్‌హౌస్ వర్గాల కథనం.








