ఫొటో కోసం ఓ దేశ ప్రధానిని నెట్టేసిన ట్రంప్
తన చేష్టలతో మరోసారి వివాదంలో నిలిచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ఫొటోకు ఫోజు ఇచ్చేందుకు ఓ దేశ ప్రధానిని పక్కకు నెట్టేశారు. అమెరికా అధ్యక్షుడి ఈ చర్య అందరినీ అవాక్కయ్యేలా చేసింది. బ్రస్సెల్స్ లోని నాటో ప్రధాన కార్యాలయంలో సభ్యదేశాల సమావేశం జరిగింది. దీని ప్రారంభంలో దేశాధిపతులు, ప్రధాన మంత్రులు ఐక్యంగా ఫొటో దిగాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాను బృందంలో మధ్యలో ఉండాలని భావించిన ట్రంప్ అక్కడ ఉన్న మోంటెనెగ్రో దేశ ప్రధానమంత్రి డస్కో మర్కో విక్ను పక్కను నెట్టేశారు.








