బతికే ధైర్యం మనకుందా?
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం జడలు విప్పుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో అసలు పాశ్చాత్య దేశాలకు బతికే ధైర్యం ఉందా లేదా అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూటిగా ప్రశ్నించారు. జీ-20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు జర్మనీలోని హ్యాంప్‌షైర్‌కు చేరుకున్న ఆయన పోలండ్ రాజధాని వార్సాను సందర్శించారు. క్రసిన్‌స్కీ స్వేర్‌లో పౌరులనుద్దేశించి ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ ఉగ్రవాద శకంలో బతికే ధైర్యం, బతకాలన్న సంకల్పం మనకున్నాయా? మన సరిహద్దులను కాపాడుకోవడానికి మన పౌరులంటే మీకు గౌరవం ఉందా లేదా? మన నాగరికతలను ధ్వసం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల నుంచి వాటిని రక్షించుకోగల ధైర్యం, రక్షించాలన్న కోరిక మనకు ఉన్నాయా? అంటూ శరపరంపరగా ప్రశ్నలు సంధించారు. కాగా పోలండ్‌తో అమెరికా సంబంధాలు గతం కాన్న ఎంతో బాగున్నాయని ట్రంప్ తెలిపారు.








