సైన్యానికి డొనాల్డ్ ట్రంప్ సూచన
ఉత్తర కొరియాతో దేశ భద్రతకు ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడితే, దాడికి వెనుకాడవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సైన్యానికి సూచించారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియా కూడా ఉత్తర కొరియాను రెచ్చగొట్టేలా తొలి వ్యాఖ్యలు, చర్యలకు దిగరాదని సూచించిన ట్రంప్ సైన్యం మాత్రం యుద్ధం చేయడానికి ఏ క్షణమైనా సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని ట్రంప్ తెలిపినట్టు అమెరికా రక్షణ శాఖ మంత్రి టిల్లర్సన్ తెలిపారు. తాము ఎదురు చూస్తున్న సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు.













