తొలి ఐదేళ్లు వలసదారుల సంక్షేమానికి ట్రంప్ చెక్
అమెరికాకు వచ్చే వలసదారులు తొలి ఐదేళ్లు సంక్షేమ పథకాల లబ్ధి పొందలేరని పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. గ్రీన్‌కార్డుల(శాశ్వత నివాస హోదా) జారీని తగ్గించే లక్ష్యంతో ప్రతిభ ఆధారిత వలస విధానానికి(రైజ్ చట్టం) మద్దతు తెలిపిన రెండ్రోజులకే తాజా నిర్ణయాన్ని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రజల్ని ఉద్దేశించి వారాంతపు వెబ్, రేడియో ప్రసంగం చేస్తూ.. ‘మీరు మా దేశంలోకి వచ్చిన ఐదేళ్ల అనంతరం గానీ సంక్షేమ పథకాల్ని అందుకోలేరు. గతంలో లాగా అమెరికాలో ప్రవేశించగానే ప్రయోజనాల్ని పొందడం ఇక నుంచి కుదరదు’ అని పేర్కొన్నారు.













