ఆమె కోసం చేయి చాచిన ట్రంప్… షాకిచ్చిన పోలెండ్ ప్రెసిడెంట్ వైఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలనియా పోలాండ్ పర్యటనకు వెళ్లారు. అయితే అపీషియల్ ఫోటో కాల్ లో పోలాండ్ ప్రెసిడెంట్ అంద్రెజ్ దుడా, ఆయన భార్య కొర్న్ హాసర్ లు ట్రంప్, మెలనియా లను కలిశారు. ఇక ట్రంప్ వెంటనే పోలాండ్ ప్రెసిడెంట్‌తో చేతులు కలిపారు. తర్వాత ఆయన భార్య కొర్న్ హాసర్ తో కలపబోయే సరికి ఆమె ఆయనను వదిలేసి ట్రంప్ భార్య మెలనియా తో చేతులు కలిపింది. ఈ తతంగాన్నంతా ఎంతో అమాయకంగా అలాగే చూస్తూ అలాగే ఉండిపోయారు ట్రంప్. అయితే మెలనియా కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చి ట్రంప్ కు కొర్న్ హాసర్ షేక్ హ్యాండ్ ఇచ్చింది. అయితే, ట్రంప్ ను పోలాండ్ ఫస్ట్ లేడీ ఇగ్నోర్ చేసిందని, ఆయనకు ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఆయనను అలా వదిలేసి ఎలా వెళ్తుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ మండి పడుతున్నారు. అయితే దీనిపై పోలాండ్ ప్రెసిడెంట్ అంద్రెజ్ దుడా స్పందించారు. కొర్న్ అసలు ట్రంప్ ను ఇగ్నోర్ చేయలేదని ట్రంప్, ఆయన భార్యతో షేక్ హ్యాండ్స్ చేసిందని, షేక్ న్యూస్‌ను నమ్మొదంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ షేక్ హ్యాండ్స్ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది.








