వీసాలు లేని వారిపై కఠిన వైఖరి
సరయిన పత్రాలు లేకుండా అమెరికాలో నివశిస్తున్న విదేశీ యువకుల మీద ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. తిప్పి పంపుతారనే భయం లేకుండా, వారు దేశంలో నివశించేందుకు అప్పట్లో ఒబామా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఒబామా చేపట్టిన ప్రోగ్రామ్ రాజ్యాంగ విరుద్దమని, కాకపోతే ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్‌కు అవకాశమివ్వడానికి మరికొంత గడువు ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ప్రభుత్వంలోని అత్యున్నత సలహాదారులతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చారు. సరయిన పత్రాలు లేకుండా అమెరికాలో చిన్ననాటి నుంచీ ఈ విధంగా నివశిస్తున్న విదేశీ యువకులు (డ్రీమర్స్) సంఖ్య దాదాపు 8 లక్షలు దాకా వుంటుందని అంచనా. భవిష్యత్ నిర్ణయించే అంశాన్ని కాంగ్రెస్‌కు అప్పచెప్పడం ద్వారా వైట్‌హౌస్ తన మీదున్న కొంత వత్తిడిని తగ్గించుకున్నట్లవుతుందని, అంతేకాకుండా డ్రీమర్స చట్టబద్దత మీద ప్రజా చర్చలకు ఆస్కారం కల్పించడంతో ఈ అంశం మరికొన్ని నెలలపాటు సాగదీసేందుకు వీలు కలుగుతుంది.













