అధ్యక్ష పదవి కుటుంబానికి భారమే
అమెరికా అధ్యక్ష పదవి తన కుటుంబానికి భారమేనని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా వంద రోజుల పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయన తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తన భార్య మెలానియా ట్రంప్‌ను మీడియా టార్గెట్ చేసి దూషిష్తోందని ఆరోపించారు. వృతిపరంగా తాను పెద్ద పదవిలో ఉన్నా మీడియా మాత్రం తనను చిన్నచూపు చూస్తోందని దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి ట్రంప్ మీడియాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వరద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ట్రంప్ పెన్సిల్వేనియాలోని హ్యారిస్బర్గ్లో బహిరంగ సభలో ప్రసంగించారు. తన వంద రోజుల పాలనతో సాధించిన విజయాలపై మీడియా కవరేజ్ పట్ల ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు. వీడియోకు వైఫల్య గ్రేడ్ ఇవ్వాలని వ్యాఖ్యానించారు.













