మార్పు కోసమే ప్రజలు ఓటేశారు
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. గత అధ్యక్షుడు ఒరాక్ ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకం ఒబామా కేర్‌ను రద్దు చేసి, దాని స్థానంలో మరో ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కూడా ట్రంప్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో మార్పు తేవాలని, తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఓట్లు వేశారని ట్రంప్ తన పార్టీ సహచరులకు చెప్పారు. నవంబర్ 8న అమెరికా ప్రజలు చారిత్రాత్మక మార్పు కోసం ఓటు వేశారు. దిగువ, ఎగువ సభలు, వైట్‌హౌస్ తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి కూడా వారు ఓటు వేశారు. అమెరికా ప్రజలు మమ్మల్ని సృష్టంగా ఆదేశించారు. తీరిక లేకుండా చేయవలసిన పనులు చేయడానికి ఇదే తగిన సమయం అని ట్రంప్ నేషన్ల్ రిపబ్లికన్ కాంగ్రెస్ సెల్ కమిటీని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు.













