ఆ అధ్యక్షుడితో భేటీ చాలా కష్టం
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో జరగబోయే సమావేశం చాలా కష్టంగా ఉండబోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వచ్చే వారంలో జిన్పింగ్తో సమావేశం ఉండనుందని తెలిపారు. చైనా తమ ఆర్థిక సంపదనంతా దోచుకెళుతోందని, తమ వ్యాపారాన్ని మొత్తం దెబ్బకొడుతోందని, ఉద్యోగాలు కొల్లగొడుతుందని ట్రంప్ గతంతో ఆరోపించిన నేపథ్యలో తాజాగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదీ కాకుండా ట్రంప్ కూడా ఇక తాము ఏ మాత్రం వాణిజ్యవ్యాపారాన్ని నష్టపోవడం తమకిష్టం లేదని, ఉద్యోగాలు కోల్పోవడం ఇష్టం లేదని తెలిపారు. చైనా, అమెరికా మధ్యలో వాణిజ్యపరమైన విభేదాలు తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చైనా సహాయంతో వ్యాపారం నిర్వహిస్తున్న కంపెనీలు ప్రత్యామ్నాయం చూసుకోవాలని కూడా ట్రంప్ సూచించారంట.













