జీఎస్టీ సూపర్ … తాము కూడా అమలు చేస్తాం
దేశవ్యాప్తంగా వచ్చే నెల నుంచి అమలు చేయనున్న జీఎస్టీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. భారత్ చరిత్రలోనే ఇది అతి పెద్ద సంస్కరణ అని అన్నారు. ఇది భారతీయులకు భారీగా కొత్త ఉద్యోగావకాశాలు కల్పిస్తుందన్నారు. తమ ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి తాము కూడా జీఎస్టీని అమలు చేస్తామని చెప్పారు. ముప్పుగా పరిణమించిన అవినీతిపై పోరాడుతున్నన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ అని, త్వరలోనే అమెరికాను భారత్ చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.








