బ్రిటన్ చిన్నారికి డొనాల్డ్ ట్రంప్ సాయం
అరుదైన జబ్బుతో బాధపడుతున్న ఓ బ్రిటన్ చిన్నారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాయం చేస్తానని తెలిపారు. గత కొంత కాలంగా మెదడుకు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్న 10 నెలల ఛార్లీ గార్డ్ అనే చిన్నారికి వైద్యం అందించేందుకు అమెరికా తీసుకెళ్లాల్సి ఉంది. అయితే పాపను యూఎస్ తీసుకొచ్చేందుకు బ్రిటన్ న్యాయస్థానం, మానవహక్కుల యూరోపియన్ కోర్టు అంగీకరించడం లేదు. ఇటువంటు పరిస్థితుల్లో ఉన్న చిన్నారికి సహాయం చేసేందుకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. తీవ్రమైన బాధలో ఉన్న ఆ చిన్నారిని కాపాడేందుకు సహాయం చేస్తాను. యూకేలో ఉన్న తమ స్నేహితులతో మాట్లాడి వీలైనంత త్వరగా యూఎస్ తీసుకొచ్చేలా చూస్తామని ట్రంప్ ట్వీట్ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి చిన్నారికి సహాయం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటనలో పేర్కొంది. చిన్నారి దయనీయమైన పరిస్థితిపై పోప్ ప్రాన్సిస్ కూడా స్పందించారు. చిన్నారి చికిత్సకు అవసరమయ్యే ఖర్చు కోసం షష్ట్రaతీశ్రీఱవరటఱస్త్రష్ట్ర్.శీతీస్త్ర ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. దాంతో పాటు గోఫండ్ మీ ద్వారా ఇప్పటి వరకు 1.68 మిలియన్ డాలర్లను సేకరించారు.













