భారత్లో అమెరికా రాయబారిగా జస్టర్
ప్రముఖ ఆర్థిక సలహాదారు, భారత్-అమెరికా పౌర అణు ఒప్పందం రూపకర్తల్లో ఒకరైన కెన్నెత్ జస్టర్(62)ను భారత్లో అమెరికా రాయబారిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ట్రంప్ అధ్యక్షుడైన సమయంలో భారత రాయబారిగా ఉన్న రిచర్డ్ వర్మ జనవరిలో తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి అది ఖాళీగానే ఉంది.








