శాంతిని అలవర్చుకో … ట్రంప్ కు పోప్ హితవు
అమెరికా అధ్యక్షుని హోదాలో విదేశీ పర్యటనలతో బిజిబిజిగా గడుపుతున్న డొనాల్డ్ ట్రంప్ వాటికన్‌సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. ఆయనకు మార్టిన్ లూథర్ కింగ్ రాసిన పుస్తకాలను బహుమతిగా అందజేశారు. ప్రతిగా శాంతికి చిన్నమైన ఆలీవ్ వృక్ష బొమ్మను ట్రంప్‌కు పోప్ అందజేశారు. శాంతిని వినియోగించడం అలవర్చుకోవాల్సిందిగా ట్రంప్‌ను కోరిన పోప్ శాంతిదూతగా వర్థిల్లాలని హితవు పలికారు. దీనిపై స్పందించిన ట్రంప్ పోప్ సందేశాన్ని తాను మరువననీ హామీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో పరస్పరం విమర్శలు గుప్పించుకున్న ఇద్దరూ నేతలు నాటి సమావేశంలో నవ్వులు చిందిస్తూ సరదాగా గడపడం విశేషం. మెక్సికో-అమెరికా మధ్య ప్రహారీ నిర్మిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రతిపాదనను పోప్ తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. పోప్ తనను ఆహ్వానించి ఆశీర్వదించటం తనకు లభించిన అపూర్వ గౌరవమని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇరువురు దాదాపు 30 నిముషాలసేపు దుబాసీల సాయంతో భేటీ అయ్యారు.













