భారత్ -అమెరికా మధ్య సత్సంబంధాలు: డొనాల్డ్ ట్రంప్
భారత్-అమెరికా మధ్య సత్సంసంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆయన ఇరు దేశాల సత్సంబంధాల సంబంధించిన ఓ సందేశాన్ని విడుదల చేశారు. అమెరికా అభివృద్ధి రూపకల్పనలో భారతీయ అమెరికన్ల పాత్ర వెలకట్టలేనిదని ట్రంప్ కొనియాడారు. హిందువులు, భారతీయ-అమెరిక్లకు కృతజ్ఞతలు. భవిష్యత్ తరాల కోసం ఇరు దేశాల మధ్య ఉండే స్నేహాపూర్వక బంధాలను మరింత పెంపొందించేందుకు కృషి చేస్తాం. భారతీయుల 71 స్వాతంత్య్ర వేడుకల్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న హిందువులు, భారతీయ అమెరికన్లను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది అని అన్నారు.








