అవసరమైతే ఆమె పదవి తొలగిస్తా …. డొనాల్డ్
ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారి నిక్కీ హేలీపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ జోక్ వేశారు. అవసరమైతే ఆమెను పదవి తొలగిస్తానంటూ చెప్పి, ఆ వెంటనే ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో సీరియస్గా సాగుతున్న సమావేశంలో కాసేపు సరదా నవ్వులు పూశాయి. ఐరాస భద్రతమండలిలో రాయబారిగా పనిచేస్తున్న అధికారులతో ట్రంప్ సమావేశం నిర్వహించారు. ఇందులో అధికారులకు ట్రంప్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిక్కీ హేలీ గురించి మాట్లాడుతూ ఆమె అద్భుతంగా పనిచేస్తోంది. ఎవరైనా అలా చేస్తున్నారా? ఒక వేళ అమె అలా పనిచేయకపోయి ఉంటే గనుక నిక్కీని సులువుగా పదవి నుంచి పీకేసీ వేరే వారిని భర్తీ చేయగలను అన్నారు. ఆ వెంటనే కానీ మేమెప్పటికీ ఆలా చేయబో. నిక్కీ పనితీరు నిజంగా అద్భుతం అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలకు నిక్కీ సహా అధికారులందరూ నవ్వులు చిందించారు.













