ట్రక్కు డ్రైవర్ గా మారిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రక్కు డ్రైవర్ అవతారం ఎత్తారు. శ్వేతభవనం ముందు పార్క్ చేసిన ట్రక్కులోకి ఎక్కి సందడి చేశారు. అగ్రదేశాధ్యక్షుడు ట్రక్కు నడుపుతున్న ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియలో సరదా కామెంట్లు పోటెత్తాయి. ట్రక్కు డ్రైవర్లు, ఆ రంగానికి చెందిన ప్రతినిధులతో డొనాల్డ్ ట్రంప్ సమవేశమయ్యారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ ముందు పార్క్ చేసిన ట్రాక్టర్ ట్రైయిలర్ వాహనంలోకి ఎక్కిన ట్రంప్ కొద్ది నిమిషాల పాటు సందడి చేశారు. డ్రైవర్ సీటులో కూర్చుకుని ముందుగా హారన్ మోగించారు. స్టీరింగ్ పట్టుకుని తనదైన శైలిలో హావభావాలు పలికించారు. ట్రక్కు డ్రైవర్లకు తెలిసినంతగా అమెరికా గురించి తెలియదు. రోజు వారు కొండలు, లోయలు చూస్తారు. రోడ్లపై పూడ్చాల్సిన ప్రతి గొయ్యిను పరిశీలిస్తారని ట్రంప్ ఈ సంరద్భంగా వ్యాఖ్యానించారు. ట్రక్కు డ్రైవర్ అవతారం ఎత్తిన ట్రంప్ ఫొటోలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడంతో ట్విటర్ లో నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు.













