అమెరికాలోనే ఉండేలా డ్రీమర్లకు అనుమతి
అమెరికాలోకి చిన్నవయసులో అక్రమంగా ప్రవేశించిన వలసదారుల(డ్రీమర్స్)కు రక్షణ కల్పించే అంశంపై డెమోక్రాట్లతో ఒప్పందానికి చేరువలో ఉన్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే 8 లక్షలమందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. డ్రీమర్లకు రక్షణ కల్పిస్తున్న బాల్యంలో వచ్చిన వారిపై చర్యల నిలిపివేత(డీఏసీఏ) పథకాన్ని ట్రంప్ ఇటీవల రద్దు చేశారు. డీఏసీఏకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసేందుకుగాను కాంగ్రెస్కు ఆయన ఆర్నెళ్ల సమయమిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మైనారిటీవర్గాల నేత నాన్సీ పెలోసి(డెమోక్రాట్), సెనేట్ మైనారిటీవర్గాల నేత చుక్ ఘమర్ (డెమోక్రాట్)లతో శ్వేతసౌధంలో ట్రంప్ పలు అంశాలపై చర్చలు జరిపారు.













