అదంతా అబద్ధం.. ఐ లవ్ వైట్‌హౌస్
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధాన్ని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెత్తకుండీ (డంప్)తో పోల్చారంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అదంతా అబద్ధమని, వైట్‌హౌస్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు ట్రంప్. నాకే శ్వేతసౌధం అంటే చాలా ఇష్టం. నేను చూసిన భవనాల్లో (ఇళ్లలో) వైట్‌హౌస్ చాలా అందమైనది. కానీ నకిలీ మీడియా నేను దాన్ని డంప్ అన్నట్లుగా చూపించింది. అదంతా పూర్తిగా అబద్దం అని ట్రంప్ ట్వీట్ చేశారు.








