పిలవని పేరంటానికెళ్లిన డొనాల్డ్ ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా సెన్సేషనే. వీకెండ్ కు గోల్ఫ్ క్లబ్లో ఎంజాయ్ చేద్దామనుకున్న ట్రంప్ ఓ విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. గోల్ఫ్ క్లబ్ కు దగ్గరల్లో జరిగే ఓ వెడ్డింగ్ రిసెప్షన్‌కు వెళ్లాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా, సడెన్‌గా వెడ్డింగ్ లో ప్రత్యక్షమయ్యారు. దీంతో పెళ్లి కి వచ్చిన గెస్టులతో సహా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే పెళ్లి కూతురు ట్రంప్ దగ్గరకి పరిగెత్తుకు వచ్చి, కౌగిలించుకొని ఓ ముద్దిచ్చింది. వెంటనే ట్రంప్ పెళ్లి కూతురు తో ఫోటోలకు పొజిచ్చారు. తర్వాత పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పేర్లను అడిగి తెలుసుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అంటూ చెప్పి అక్కడున్న వాళ్ళకు చేతులూపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన ఉన్నది కొంచెం సేపే అయినా ట్రంప్ ఉన్నంత సేపు రిసెప్షన్ కు వచ్చిన వాళ్లంతా యూఎస్ ఏ యూఎస్ఏ అంటూ అరిచారు. ట్రంప్ ఇలా సడెన్ గా వెడ్డింగ్ రిసెప్షన్లకు వెళ్లడం ఇదే తొలిసారేమీ కాదు, లాస్ట్ ఫిబ్రవరిలో కూడా ఇలాగే ఓ పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ట్రంప్.













