అన్నంత పనిచేసిన ట్రంప్
అఫ్గానిస్తాన్ నుండి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకునేది లేదని గత నెలలో సృష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. తాను చెప్పిన విధంగానే దాదాపు మరో 3,500 సైనికులను ఆఫ్గానిస్తాన్కు పంపేందుకు పచ్చజెండా ఊపారు. ఇప్పటికే అక్కడున్న 14,500 మంది సైన్యానికి తోడుగా వీరిని పంపిస్తున్నట్లు రక్షణశాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ తెలిపారు. ఇంకా ఎంత మందిని పంపాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిందో వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా బలగాల మోహరింపు ఉంటుందని సృష్టం చేశారు.













