డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త ప్రతిపాదన
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధానికి పొరుగు దేశం మెక్సికో సరిహద్దులో గోడ కట్టాలని దృఢ సంకల్పంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్తగా మరో ప్రతిపాదన చేశారు. ఈ గోడపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. దీని వల్ల ఆదాయం వస్తుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు ఈ గోడ కట్టితీరాలని ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. సోలార్ ప్యానెళ్ల వ్యాపారి లాస్ వేగాస్కు చెందిన టామ్ గ్లీసన్ కొన్ని నెలల కిందట ఇలాంటి ప్రతిపాదననే ప్రభుత్వానికి సమర్పించారు కూడా.













