కూతురు చేసిన పనిని సమర్థించిన డొనాల్డ్ ట్రంప్
జర్మనీలో గతవారం జరిగిన జి20 సదస్సులో తండ్రి సీటులో కూర్చున్న ట్రంప్ కూతురు ఇవాంకపై అనేక విమర్శలు వెలువెత్తుతుండగా తన కూతురి చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. ఆమె కూర్చోడానికి అన్ని ప్రమాణాలు ఉన్నాయి అందుకే కాన్ఫరెన్స్ రూమ్‌కు వెళ్లే ముందు ఇవాంకను నా సీట్లో కూర్చొమని నేను చెప్పాను అని ట్రంప్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఇవాంక అమెరికా ప్రతినిధి బృందంలో ఒకరని, ఆమె శ్వేత సౌధంలో పనిచేస్తుంటారని, అమెరికా అధ్యక్షుడు సీటులో లేనప్పుడు ఆయన సీటులో ఎవరు కూర్చోవాలన్నది ప్రతినిధి బృందమే నిర్ణయిస్తుంది అని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సైతం ఇవాంకను సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. ఇవాంక అమెరికా ప్రతినిధి బృందంతో ఈ ఏడాది భారత్‌ను కూడా సందర్శించనున్నారు.













