మరో భారతీయ అమెరికన్ కు కీలక పదవి
హెచ్-1బీ వీసాల వ్యవహారంలో భారత్‌పై భారీ ప్రభావం పడేలా నిర్ణయం తీసుకున్నా, ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం భారతీయులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే అనేకమంది భారతీయులకు తన ప్రభుత్వంలో కీలక పదవుల్లో నియమించిన ట్రంప్, తాజాగా మరో భారతీయుడికి అవకాశం కల్పించారు. 40 ఏళ్ల వయసున్న నీల్ చటర్జీ అనే భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అమెరికా పవర్ గ్రిడ్, కోట్లాది రూపాయల విలువ చేసే ప్రాజెక్టులను పర్యవేక్షించే ఫెడరల్ ఎనర్జీ రెగ్యూలేటరీ కమీషన్ మెంబర్‌గా చటర్జీని నామినేట్ చేశారు. 30 జూన్ 2012 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో కీలకశాఖల్లో ముఖ్య అధికారిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయనకు ఈ అవకాశం కల్పించారు.













