ట్రంప్ తీరు సరి కాదు: డాన్ కిల్డీ
ట్రంప్ భారతీయుల పట్ల వివక్ష కనబరుస్తున్నారని, ఇమ్మిగ్రేషన్ అమెరికాలో ఓ అంతర్భాగమని తన పిల్లలు విభిన్న సంస్కృతుల పెరగడాన్నే తాను సమర్థిస్తానని మిషిగన్ నుండి అమెరికన్ కాంగ్రెస్‌కు ఎన్నికైన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి డాన్ కిల్డీ అన్నారు. శనివారం సాయంత్రం డెట్రాయిట్ తెలుగు సంఘం 40వ వార్షికోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రవాసులతో ముఖాముఖి పాల్గొన్నారు. కాట్రగడ్డ కృష్ణప్రసాద్, డా.ముక్కామల అప్పారావు, డా.బాబీ ముక్కామల సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాన్ ప్రవాసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. చైనా-ఇండియా గొడవల నేపథ్యంలో అమెరికా ఎటువైపు ఉంటుందనే ప్రశ్నకు బదులిస్తూ చైనా తమకు వాణిజ్యపరమైన శత్రువని, భారత్‌ను ఓ పెద్ద అవకాశాల గనిగా భావిస్తామని ఆయన పేర్కొన్నారు.













